Monday, June 17, 2024

England-Pakistan : ఇంగ్గండ్ చేతిలో పాక్ చిత్తు…

జూన్ రెండు నుంచి టీ 20 ప్రపంచకప్ మొదలు కానుంది. ఇప్పటికే కొన్ని జట్లు అమెరికా, వెస్టిండీస్‌కు చేరుకున్నాయి. మరికొన్ని వెళ్తున్నాయి. మెగా టోర్నమెంట్‌కు ముందు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ ఓపెనర్ జోస్ బట్లర్ దూకుడు మీద ఉన్నాడు.

తాజాగా ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య నాలుగు టీ20 మ్యాచ్ సిరీస్ జరుగుతోంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. రెండో మ్యాచ్ బర్మింగ్‌హామ్ వేదికగా జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ జట్టు 23 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ముఖ్యంగా కెప్టెన్ జోస్ బట్లర్ వీర విహారం చేశాడు. కేవలం 51 బంతుల్లో 84 పరుగులు చేశాడు. విజయంలో కీలకపాత్ర పోషించాడు.

- Advertisement -

తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా సాల్ట్- జోస్ బట్లర్ బరిలోకి దిగారు. జట్టు స్కోర్ కేవలం 25 పరుగుల వద్ద సాల్ట్ ఔటయ్యాడు. తర్వాత జాక్స్- బట్లర్‌ పాక్ బౌలర్లను ఆటాడు కున్నారు. 10 ఓవర్లకు 96 పరుగులు చేసింది జోడి. ఈ క్రమంలో జాక్స్ 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు. తోటి ఆటగాళ్ల నుంచి సహకారం అందుకున్న బట్లర్ చెలరేగిపోయాడు. పాక్ బౌలింగ్‌ను చీల్చి చెండాడు. 18వ ఓవర్లలో రవూఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించక పోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేసింది. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది మూడు వికెట్లు, వసీమ్, రవూఫ్ రెండేసి వికెట్లు తీశారు.

184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బాబర్ సేన, ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. పవర్ ప్లే ఓపెనర్లు అవుటయ్యారు. తర్వాత వచ్చిన కెప్టెన్ బాబర్-జమాన్ మాత్రమే రాణించారు. 19.2 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటయ్యింది. ఆరుగురు ఆటగాళ్లు కేవలం సింగిల్ డిజిట్‌తో సరిపెట్టుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టాప్లీ మూడు వికెట్లు, మెయిన్ అలీ, ఆర్చర్ రెండేసి వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement