Thursday, May 9, 2024

121 కలర్స్, 121 డిజైన్‌లు… ఇక్క‌త్‌ మల్టి కలర్స్, మల్టి మోటివ్స్‌ చీర రూపకల్పన

భూదాన్‌పోచంపల్లి: అగ్గిపెట్టెలో పట్టె చీరెను నేసి ఔరా అని పోచంపల్లి చేనేత కళాకారులు అంతర్జాతీయ ఖ్యాతికెక్కారు. మారుతున్న కాలానుగుణంగా ప్రజల అభిరుచికి తగ్గట్టు చేనేత కళాకారులు ఇక్కత్‌ డిజైన్‌లను సృష్టిస్తూ నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్నారు. తాజాగా పోచంపల్లికి చెందిన చేనేత క‌ళాకారుడు భోగ బాలయ్య 121 రంగులు, 121 డిజైన్‌ల చీర‌ను తయారు చేశాడు. ఇక్కత్‌ చీరెలో కొత్తగా ఏదైనా చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని పదేళ్లుగా తాపత్రయం పడ్డాడు. నిరంతరం పరిశ్రమించి తన పదేళ్ల కలను సాకారం చేసుకొన్నాడు..

121 రంగులు, 121 రకాల డిజైన్‌లతో అద్బుతంగా చీరెను తయారు చేశాడు. అంతేకాక 11 రంగులతో ట్రెడిషనల్‌ టెంపుల్‌ ఆకృతి చీరెఅంచు దీని ప్రత్యేకత. అయితే 22 చిటికిలు, 1 చిటికికి 22 కొయ్యల, 6 కొలుకులతో చీరె తయారీకి ఉపయోగించాడు. కోయంబత్తూర్‌ నుంచి ప్రత్యేకంగా 2/20 నెంబర్‌ మస్టర్డ్‌ నూలును తెప్పించాడు.

స‌న్మానించిన మంత్రి కేటీఆర్‌..
121 రంగుల మల్టి కలర్స్, మల్టి మోటివ్స్‌ ఇక్కత్‌ చీరెను తయారు చేసిన భోగ బాలయ్య ప్రతిభను గుర్తించి ఇటీవల జాతీయ చేనేత దినోత్సవం రోజున హైద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డుతో సత్కరించారు. జాతీయ అవార్డు కోసం ఎంట్రీ పంపించాడు. అదేవిధంగా సీనియర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి చిరంజీవులు బాలయ్య రూపొందించిన మల్టికలర్స్‌ చీరెను చూసి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement