Monday, April 29, 2024

ఓటీటీలో ‘బంగార్రాజు’

ఓటీటీలో రిలీజ్ కానుంది బంగార్రాజు చిత్రం. జీ5లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం థియేట‌ర్ లో విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ఇప్పుడు ఓటీటీలో సంద‌డి చేయ‌నుంది. అక్కినేని నాగార్జున, తనయుడు నాగ చైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘బంగార్రాజు. సంక్రాంతి పండుగనాడు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కరోనా థర్ట్ వేవ్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆరేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు ప్రపంచవ్యాప్తంగా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఫలితంగా కరోనా కాలంలో విడుదలై విజయవంతమైన సినిమాగా రికార్డులకెక్కింది.’

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement