Thursday, April 25, 2024

వరసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా

మత్స్యకారుల అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా ఇచ్చిన ప్రతి హామీని బాధ్యతగా జ‌గ‌న్ స‌ర్కార్ నెరవేరుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్ళే 1,08,755 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేద సమయం అయిన ఏప్రిల్‌ 15 – జూన్‌ 14 కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ. 10 వేల చొప్పున దాదాపు రూ. 109 కోట్ల ఆర్ధిక సాయం, దీంతో పాటు ఓఎన్‌జీసీ సంస్ధ పైప్ లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ. 108 కోట్ల ఆర్ధిక సాయంతో కలిపి మొత్తం రూ. 217 కోట్లు నేడు (13.05.2022) కోనసీమ జిల్లా మురమళ్ళ గ్రామంలో వారికి అందజేయనున్నారు సీఎం జ‌గ‌న్.

2012లో జీఎస్‌పీసీ త్రవ్వకాల వల్ల అప్పట్లో జీవనోపాధి కొల్పోయిన 14,824 మత్స్యకార కుటుంబాలకు ఆర్ధిక సాయం గత ప్రభుత్వంలో బదిలీకాక, పట్టించుకునే నాధుడు లేక ఇబ్బంది పడుతున్న వేళ వారిని శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకుంటూ ముందస్తుగా ఈ ప్రభుత్వమే రూ. 70.04 కోట్ల పరిహారం చెల్లించింది. నేడు అందిస్తున్న ఆర్ధికసాయంతో కలిపి ఇప్పటివరకు కేవలం వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం క్రింద మాత్రమే అందించిన మొత్తం సాయం రూ. 418 కోట్లు.

జగన్‌ ప్రభుత్వంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం ద్వారా సముద్రంలో చేపల వేట నిషేద సమయంలో ఇచ్చే భృతిని రూ. 10 వేలకు పెంచి మర, యాంత్రిక పడవలతో పాటు సాంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకార కుటుంబాలను కూడా చేర్చి చెల్లిస్తోంది. గతంలో డీజిల్‌ ఆయిల్‌పై సబ్సిడీ లీటర్‌కు రూ. 6.03 ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రూ. 9 కి పెంచడమే కాక స్మార్ట్‌ కార్డులు జారీ చేసి డీజిల్‌ పోయించుకునేటప్పుడే సబ్సిడీ లబ్ధి వారికి అందేలా ఏర్పాటు చేశారు. వేట చేస్తూ మరణించిన మత్స్యకార కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 3,606 కోట్ల వ్యయంతో 9 ఫిషింగ్‌ హర్బర్లు, 4 ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. గత ప్రభుత్వం సముద్రంపై చేపల వేట నిషేద కాలంలో మత్స్యకార కుటుంబాలకు కేవలం రూ. 4 వేలు, అదీ కొందరికే, అది కూడా బకాయిలు పెడుతూ అరకొరగా చెల్లింపు చేసే పరిస్ధితి ఉండేది.

Advertisement

తాజా వార్తలు

Advertisement