Thursday, June 1, 2023

NZB: ప్రభుత్వాస్పత్రిలో వైద్యురాలు అనుమానాస్పద మృతి

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జనరల్ ఆసుపత్రిలో గైనిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శ్వేత.. గురువారం రాత్రి 2 గంటల వరకూ డ్యూటీలోనే ఉన్నారు. తోటి వైద్యులు ఉదయం ఆమె గదిలోకి వెళ్లి చూసేసరికి.. డాక్టర్ శ్వేత విగతజీవిగా పడి ఉన్నారు. శ్వేత గుండెపోటుతో మరణించి ఉండొచ్చునని వైద్యులు భావిస్తున్నారు. అయితే శ్వేతది సహజ మరణమా? లేక ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement