Sunday, May 5, 2024

ప్ర‌మాద‌క‌ర‌మైన స్టంట్స్ – బైక్ తో పాటు కాలువ‌లోకి దూకిన యువ‌కుడు

బైక్ తో పాటు కాలువ‌లోకి దూకాడు ఓ యువ‌కుడు. హ‌ర్యానాలోని పానిప‌ట్‌కు చెందిన ఓ యువ‌కుడు ఢిల్లీ పార‌ల‌ల్ కెనాల్‌లో ప్ర‌మాద‌క‌ర బైక్ స్టంట్ చేసిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఢిల్లీ పారలల్ కెనాల్ లో ఓ యువకుడు బైక్‌తో కాలువలోకి దూకాడు. అనంత‌రం కాలువలో డ్యాన్స్ చేశాడు. ప‌క్క‌నే నిల్చున్న యువ‌కులు సంద‌డిచేస్తూ అత‌డిని ఎంక‌రేజ్ చేస్తున్నారు. 34 సెకన్ల నిడివిగ‌ల ఈ వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. క్రిమినల్ ప్రొసీజర్ రూల్స్, 1973లోని సెక్షన్ 144 ప్రకారం యమునా నది, కాలువలు, డిస్ట్రిబ్యూటర్లు, నీటి వ‌న‌రుల్లో స్నానం చేయ‌డం, బ‌ట్ట‌లుత‌క‌డం లాంటివి నిషేధం. అయినా, ఈ ఆదేశాల‌ను యువ‌కులు పాటించ‌డం లేదు. దీంతో పానిపట్‌లో ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement