Thursday, May 2, 2024

నిఖిల్ తాజా మూవీ – టైటిల్ రిలీజ్ ఎప్పుడంటే

నాలుగు చిత్రాల్లో న‌టిస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్..వాటిల్లో నిఖిల్ హీరోగా గారీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పై థ్రిల్ల‌ర్ సినిమా తెర‌కెక్క‌నుంది. గ‌తేడాదే ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను నిఖిల్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించాడు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రంపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను ఆదివారం ఉదయం 11.11 నిమిషాలకు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. గ‌న్స్‌, బుల్లెట్లు, రూట్ మ్యాప్‌లు ఉన్న ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. ఐశ్వ‌ర్య మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈడీ ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం నిఖిల్ న‌టించిన ‘కార్తికేయ‌-2′, ’18 పేజీస్’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement