Monday, May 6, 2024

IT Sector: ఆఫీసుకు రావాల్సిందే.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తిప‌లికిన‌ టీసీఎస్‌

ఉద్యోగులంతా తిరిగి కార్యాలయాలకు రావాలంటూ టీసీఎస్‌ ఆదేశాలు జారీచేసింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి ఆఫీస్‌కు చేరుకోవాలని కోరింది. నవంబర్‌ 15 నుంచి ఆఫ్‌లైన్‌ విధులకు రావాలని చెప్పింది. కొవిడ్‌ తగ్గుముఖం పట్టినందున మునుపటి విధానానికి (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) పుల్‌స్టాప్‌ పెట్టనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాnల్సి ఉంటుందని సంస్థ సూచించినట్లు పలు నివేదికలు బయటకు వచ్చాయి.

అదే సమయంలో 95 శాతం మందికిపైగా ఉద్యోగులు పూర్తిస్థాయిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారని టీసీఎస్‌ వెల్లడించింది. నవంబర్‌ నుంచి రిటర్న్‌ టు ఆఫీస్‌ మోడల్‌ను అమలు చేస్తున్నామని సీఈవో రాజేష్‌గోపినాథన్‌ తెలిపారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి ఆఫీస్‌కు వచ్చేలా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు టీసీఎస్‌ వేరియబుల్‌ పే విధానాన్ని వినియోగించుకుంటుంది. మిగతాటెక్‌ కంపెనీలతో సంబంధం లకుండా ఉద్యోగులకు చెల్లించే వేరియబుల్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని తాజా ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement