Saturday, April 27, 2024

World Record – కంటి వెలుగు ల‌క్ష్యం గిన్నీస్ రికార్డ్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : కేసీఆర్‌ మదిలోంచి పుట్టిన ఆలోచన కోట్లాది మంది ప్రజలు మెచ్చే పథకం రూపం దాల్చింది. అంతటితో ఆగకుండా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించేందుకు చేరువవుతోంది. ఇప్పటికే దేశంలో ప్రప్రథమంగా చేపట్టిన ‘తెలంగాణ కంటి వెలుగు’ కార్యక్రయం రాష్ట్ర ప్రతిష్టను వందల రెట్లు పెంచింది. సమస్య తీవ్రతకు ముందే కంటి పరీక్షలు నిర్వహిస్తూ ఉచిత చికిత్సలు, మందులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని గ్రామీణ ప్రజలు గెండెలకు హత్తుకుని స్వాగతిస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా మెజారిటీ కుటుంబాల నుంచి హర్షాతిర కాలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభం మొదలుకుని ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా సాగుతున్న పరీక్షలు.. రోజురోజుకూ పెరుగుతున్నాయి. కోటిన్నర దాటిన స్క్రీనింగ్‌ టెస్టులు పూర్తిచేసుకున్న ఈ ప్రతిష్టాత్మక పథకం 2 కోట్లు మించే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ ధీమా వ్యక్తం చేస్తోంది.

కంటి వెలుగు రెండో దశ స్క్రీనింగ్‌ గిన్నిస్‌ బుక్‌ రికార్డు దిశగా ముందుకు సాగుతోంది. వంద రోజుల్లో 1.8 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి గిన్నిస్‌లోకి ఎక్కాలని రాష్ట్ర సర్కారు లక్ష్యంగా పెట్టు-కొంది. కానీ, ఈ టెస్టుల సంఖ్య 2 కోట్లు దాటే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ 86 రోజుల్లో 1,56,58,982 మందికి -టె-స్టులు చేశారు. ఇంకో 17 రోజులు స్క్రీనింగ్‌ నిర్వహించాల్సి ఉండగా, టార్గెట్‌ చేరుకోవడానికి సుమారు ఇంకో 25.5 లక్షల మందికి -టె-స్టులు చేయాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండడంతో క్యాంపుల నిర్వహణ నిర్విరామంగా కొనసాగుతోంది. టార్గెట్‌ దాటితే ఈ ప్రతిష్టాత్మక పథకం గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గడువులోగా లక్ష్యాన్ని చేరుకునేలా క్యాంపులు నిర్వహించాలని, జనాలను మోటివేట్‌ చేసి కంటి పరీక్షలు చేయాలని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు

జారీ చేశారు. ఇందుకోసం ఇతర డిపార్ట్‌మెంట్ల సహకారం తీసుకుంటున్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న ప్రతి వంద మందిలో పాతిక మందికి కంటి సమస్య ఉన్నట్లు- డాక్టర్లు గుర్తించారు. సుమారు 17.58 లక్షల మందికి సైట్‌ ప్రాబ్లమ్స్‌ ఉన్నట్లు- గుర్తించి కళ్లద్దాలు వాడాలని డాక్టర్లు సిఫారసు చేశారు. సమస్య తీవ్రత తక్కువగా ఉన్న 21.85 లక్షల మందికి రీడింగ్‌ కళ్ళద్దాలు అందజేశారు. అయితే, కంటి వెలుగు తొలి దశలో కంటే ఈసారి కంటి సమస్యలు ఉన్న వారి సంఖ్య తగ్గడం గమనార్హం.
కంటి వెలుగు తొలి దశ కార్యక్రమం 2018లో జరిగింది. అప్పుడు మొత్తం ఒక కోటి 54 లక్షల మందికి -టె-స్టులు చేశారు. అందులో 50,39,000 (32 శాతం) మందికి రకరకాల కంటి సమస్యలు ఉన్నట్లు- అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన వారికి కంటి సమస్యలు లేవని తెలిపింది. రెండో దశ స్కీన్రింగ్‌లో ఇప్పటి వరకూ 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయగా, ఇందులో 39,44,000 (25 శాతం) మందికి కంటి సమస్యలు ఉన్నట్లు- గుర్తించారని సర్కారు లెక్కలు చెబుతున్నాయి. సుమారు 7 శాతం తగ్గుదల నమోదు కావడంపై డాక్టర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

2018 నాటితో పోలిస్తే, ఇప్పుడు స్కీన్ర్‌ -టైమ్‌ మరింత పెరిగింది. కరోనా లాక్‌డౌన్‌, ఆన్‌లైన్‌ క్లాసులు, వర్క్‌ ఫ్రం హోం తదితర కారణాలతో స్క్రీన్‌ -టైమ్‌ విపరీతంగా పెరిగింది. దీంతో చాలా మంది కంటి సంబంధిత సమస్యల బారిన పడ్డారు. ఈ లెక్కన కంటి వెలుగు రెండో దశ స్క్రీనింగ్‌లో కనీసం 40 శాతం మందిలో కంటి సమస్యలు బయటపడతాయని డాక్టర్లు అంచనా వేశారు. కానీ, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ 25 శాతం మందిలోనే కంటి సమస్యలు ఉన్నట్లు- తేలడం గమనార్హం. అంటే మొదటి విడత కంటి వెలుగు ఫలితాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి.

మొదటి విడత ఫలితాలు కనిపిస్తున్నాయ్‌..
రాష్ట్రంలో కంటి ససమ్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో 11,862 గ్రామ పంచాయతీల్లో కంటి వెలుగు క్యాంపులు నిర్వహించారు. ఇంకో 506 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం క్యాంపులు కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని 3,495 వార్డుల్లో స్కీన్రింగ్‌ జరపగా.. మరో 258 వార్డుల్లో క్యాంపులు నిర్వహించాల్సి ఉంది. మిగిలిన గ్రామాలు, పట్టణాలతో పాటు- ఓ వారం రోజుల పాటు- మాస్‌ క్యాంపెయినింగ్‌ నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ దవాఖాన్లు, బస్టాండ్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో క్యాంపులు పెట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల టార్గెట్‌ను రీచ్‌ అవడంతో పాటు- జనాలకు ఉపయోగకరంగా ఉంటు-ందని చెబుతున్నారు. ఊరూరా, వాడవాడలా పథకం ప్రయోజనాలపై హర్షద్వానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement