Tuesday, April 30, 2024

ICC ODI: వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల… అక్టోబర్ 15న భారత్-పాక్ ఢీ

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 12న పూణేలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే ఆఖరి గ్రూప్ మ్యాచులతో లీగ్ స్టేజ్ ముగుస్తుంది.. ముంబైలో నవంబర్ 15న మొదటి సెమీ ఫైనల్, కోల్‌కత్తాలో నవంబర్ 16న రెండో సెమీ ఫైనల్ జరుగుతాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌తో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగుస్తుంది. ఫైనల్ మ్యాచ్‌కి రిజర్వు డేగా నవంబర్ 20ని కేటాయించారు. చెన్నైలో అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఆ తర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘానిస్తాన్‌తో, అక్టోబర్ 15న పాకిస్తాన్‌తో‌ మ్యాచులు జరుగుతాయి. అక్టోబర్ 19న పూణేలో బంగ్లాదేశ్‌తో, అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజిలాండ్‌తో మ్యాచులు ఆడే టీమిండియా, అక్టోబర్ 29న లక్నోలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది.


నవంబర్ 2న ముంబైలో క్వాలిఫైయర్స్ నుంచి వచ్చే మొదటి టీమ్‌తో, నవంబర్ 11న బెంగళూరులో క్వాలిఫైయర్స్ నుంచి రెండో టీమ్‌తో టీమిండియా మ్యాచులు జరగబోతున్నాయి. నవంబర్ 5న కోల్‌కతాలో సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడుతుంది భారత జట్టు.. హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ మొదటి మ్యాచ్ ఆడుతుంది. క్వాలిఫైయర్స్ నుంచి వచ్చే జట్టుతో పాక్ హైదరాబాద్‌లో అక్టోబర్ 6న తొలి మ్యాచ్ ఆడుతుంటే, ఆ తర్వాత న్యూజిలాండ్, అక్టోబర్ 9న క్వాలిఫైయర్ 1 టీమ్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 12న పాకిస్తాన్, క్వాలిఫైయర్ 2 టీమ్‌తో హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడనుంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో హైదరాబాద్‌లో ఈ మూడు మ్యాచులు మాత్రం జరగబోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement