Thursday, May 2, 2024

ప్రభుత్వమా పట్టి లేదా..? అధికారులార మానవత్వం లేదా..?

ప్రభుత్వ అసమర్థతకి గాంధీ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి జయమ్మ అనే తల్లి నిండు ప్రాణం బలైంది. గాంధీ ఆసుపత్రి సిబ్బంది వైద్యం అందించేందుకు నిరాకరించడంతో వైద్యం అందక అంబులెన్స్ లోనే మృతి చెందింది మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ జగన్ గూడకు చెందిన మాదాసు జయమ్మ (50)

మా అమ్మకు కరోన సోకింది. ఇప్పుడు ఊపిరి ఆడుతలేదు కాపాడండి అంటూ గాంధీ ఆసుపత్రికి తీసుకెలుతే వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. ప్రాణాపాయ స్థితిలో వున్న ఆ తల్లిని కాపాడే ప్రయత్నం చేద్దామనే మానవత్వం లేకుండ కరోన పరీక్ష చేసుకున్న రిపోర్ట్ చూపిస్తేనే వైద్యం చేస్తామంటూ పంపించేసారంటూ మృతురాలి కొడుకు మాదాసు ప్రదీప్ వాపోతున్నాడు. కొడుకు కళ్ళ ముందే ఓ తల్లి వైద్యం అందక మృతి చెందింది. ప్రజలు ఇలా దిక్కు లేక ఏమి చేయాలో తోచక కొట్టుమిట్టాడుతున్నారు.

తన తల్లి సుమారు 3 రోజుల క్రితం శామీర్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోన పరీక్ష చేయగ పాజిటివ్ వచ్చిందని…వైద్యులు ఇచ్చిన మందులే వాడుతున్నామని ఈ రోజు ఊపిరి ఆడకపోవడంతో 2 ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెల్లిన బయట నుండే వెల్లగొట్టారని, ఆదుకుంటారని ప్రభుత్వ గాంధీ ఆసుపత్రికి వస్తే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసాడు కొడుకు ప్రదీప్.

Advertisement

తాజా వార్తలు

Advertisement