Sunday, May 12, 2024

ప్ర‌ముఖుల‌కి ర‌క్ష‌ణ‌గా మ‌హిళా కమాండోలు – 32మందికి శిక్ష‌ణ‌

ప్ర‌ముఖుల‌కి ర‌క్ష‌ణ క‌లిపించేందుకు రంగంలోకి దిగుతున్నారు మ‌హిళా క‌మాండోలు. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది అక్ష‌రాల నిజం. ఈ మేర‌కు సీఆర్పీ ఎఫ్ 32మంది మ‌హిళా సిబ్బందిని కూడా సిద్ధం చేసింద‌ట‌. వీఐపీల ర‌క్ష‌ణ కోసం ఈ మ‌హిళ‌ల‌కి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇచ్చారు. జనవరి నుంచి ప్రముఖుల రక్షణ బృందంలోకి ఈ మహిళా కమాండోలు చేరనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు మరో డజను వరకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న ప్రముఖులకు వీరు రక్షణ కల్పించనున్నారు.

వీరి నివాసాల వద్ద, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనూ వీరి వెంటే ఈ కమాండోలు రక్షణగా నిలవనున్నారు. ఆయుధాల్లేకుండా పోరాడడం, బాడీ మొత్తాన్ని శోధించడం, కాంతి వేగంతో ఆయుధాల వినియోగం.. ఇలా వీఐపీ రక్షణకు సంబంధించి అన్ని రకాల అంశాల్లోనూ వారు తర్ఫీదు పొందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆయుధాలు సహా రక్షణకు అవసరమైన అన్ని సాధనాలు వీరి వెంట ఉంటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement