Thursday, May 2, 2024

పుట్టింటికి వెళ్లిన భార్య‌.. హైటెన్ష‌న్ విద్యుత్ వైర్ ని కొరికిన భ‌ర్త‌

త‌న భార్య పుట్టింటికి వెళ్లి రావ‌డంలేద‌ని క్ష‌ణికావేశంలో ఓ వ్య‌క్తి హైటెన్ష‌న్ విద్యుత్ వైర్ ని కొరికాడు. దాంతో అత‌డికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘ‌ట‌న తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లా చిన్నమంగోడులో చోటు చేసుకుంది. ధర్మదురై(33)కి ఆయ‌న భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. దీంతో ధర్మదురై ఇటీవల తన బావమరుదులపై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే..మద్యం మత్తులో ఉన్న అతడిని వెయిటింగ్ రూంలో కాసేపు వేచి చూడాలని సూచించారు. వారి సూచన మేరకు కాసేపు వెయిటింగ్ రూంలోనే గడిపిన అతడు ఆ తరువాత అకస్మాత్తుగా బయటకు వెళ్లి సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కాడు. చుట్టూఉన్నవారు ఎంత వారిస్తున్నా వినకుండా హైటెన్షన్ వైర్‌ను నోటితో కొరికేశాడు. తీవ్రగాయాలపాలైన అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.ప్ర‌స్తుతం అత‌నికి చికిత్స జ‌రుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement