Wednesday, May 15, 2024

Result Day | రూలర్​ ఎవరు?.. కన్నడనాట గెలుపుపై అన్ని పార్టీల ఆశలు!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు (శనివారం) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. అన్ని పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనతాదళ్-సెక్యులర్ (జెడీ-ఎస్) తామే గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. చాలా ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు వస్తాయని అంచనా వేశాయి. 11 ఎగ్జిట్ పోల్స్ లోనూ కాంగ్రెస్​ ఎక్కువ సీట్లు సాధిస్తుందని అంచనా వేయగా.. రేపు మధ్యాహ్నం వరకు ఫలితాల పరంగా ఓ ఫైనల్​ ఫిగర్​ రానుంది.

ముఖ్య అభ్యర్థులు.. పోటీ చేసిన స్థానం

• వరుణ- సిద్ధరామయ్య (కాంగ్రెస్)

• కనకపుర- DK శివకుమార్ (కాంగ్రెస్)

• షిగ్గావ్- బసవరాజ్ బొమ్మై (BJP)

- Advertisement -

• హుబ్లీ-దర్వాడ్- జగదీష్ షెట్టర్ (కాంగ్రెస్)

• చన్నపట్న – హెచ్‌డి కుమారస్వామి (జెడి-ఎస్)

• షికారిపుర- BY విజయేంద్ర (BJP)

• చిత్తాపూర్- ప్రియాంక్ ఖర్గే (కాంగ్రెస్)

• చిక్కమగళూరు- CT రవి (BJP)

• రామనగర- నిఖిల్ కుమారస్వామి (JD-S)

మెజారిటీ మార్క్ (మ్యాజిక్ నంబర్)

కర్నాటకలో మెజారిటీ మార్క్ 113 సీట్లు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఏ పార్టీ అయినా సరే 113 సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మొదటి ట్రెండ్‌లు ఉదయం 8:30 గంటలకు వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి చాలా నియోజకవర్గాల్లో ఫైనల్​ ఫిగర్​ తేలిపోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement