Thursday, May 2, 2024

దేశ రాజధాని ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు తెలిపారు. కేవలం పార్శిళ్లనే అనుమతిస్తామని పేర్కొన్నారు. అటు థియేటర్లలో 30 శాతం కెపాసిటీకే అనుమతిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. షాపింగ్ మాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ ఫూల్స్, స్పాలు, ఆడిటోరియాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో 5వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కాగా కరోనా విజృంభణ కారణంగా ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement