Thursday, May 2, 2024

ఓటీటీలో ‘శ్రీకారం’

శర్వానంద్ హీరోగా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం శ్రీకారం. మార్చి 11న రిలీజ్ అయిన ఈ చిత్రం వ్యవసాయం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. అయితే ఫస్ట్ షో నుంచే మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మాత్రం వెనుక బడింది.నిజానికి శ్రీకారం సినిమా రిలీజ్ సమయంలో గాలి సంపత్, జాతి రత్నాలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో జాతి రత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. దీనితో కలెక్షన్స్ పరంగా శ్రీకారం వెనుక పడింది.

అయితే ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 16 నుంచి సన్ నెక్స్ట్ యాప్ లో శ్రీకారం మూవీ స్ట్రీమింగ్ కానుంది.థియేటర్స్ లో అంతగా రాణించలేకపోయిన ఈ సినిమా ఓటిటి లో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement