Saturday, April 27, 2024

ఈ వార్త పూర్తిగా ఫేక్.. నమ్మకండి

వాట్సాప్‌లో కేటుగాళ్లు ఫేక్ వార్తలను పుట్టించడం కొత్తేమీ కాదు. ఎన్ని చర్యలు తీసుకున్నా కొన్నిసార్లు నిజమనిపించేలా కొందరు వార్తలు పుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా ప్రజలు మాస్క్ ధరించడం, శానిటైజర్ వినియోగించడం లాంటివి మరిచారు. దీంతో ఇదే అదనుగా ఏపీ పోలీసుల పేరుతో నకిలీ వార్తను సృష్టించారు. మంగళవారం నుంచి మాస్క్ ధరించడం తప్పనిసరి అని ఆ వార్త సారాంశం.

మాస్కులు ధరించని పక్షంలో భారీ జరిమానా కట్టాల్సి ఉంటుందని.. గ్రామాల్లో అయితే రూ.500, పట్టణాలలో అయితే రూ.1000 జరిమానా విధించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని అందులో పేర్కొన్నారు. కాగా ఈ వార్తపై స్పందించిన పోలీసులు ఇది ఫేక్ వార్త అని నిర్ధారించారు. మాస్క్ ధరించడంపై తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని వారు స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం చెప్పినా.. చెప్పకపోయినా మన వంతుగా మాస్క్ ధరించి కరోనా నివారణకు కృషి చేద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement