Friday, May 3, 2024

BreakingL విశ్వ గురువా, విష గురువా.. ప్ర‌ధాని మోదీపై సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం

దేశంలో అభివృద్ధి జ‌రుగుతోందా? మ‌న బ‌తుకులు ఎమైతున్న‌య్ అనేది ఆలోచించండి. గ్యాస్ సిలెండ‌ర్ ధ‌ర 400 నుంచి 1200కు చేరుతదా? పెట్రోల్, డీజిల్ ధ‌ర 70 నుంచి 110కి చేరుత‌దా? మ‌నం తిండే తిండిమీద‌, క‌ట్టే బ‌ట్ట‌మీద ట్యాక్సుల మీద ట్యాక్సులు వేసి.. పెట్టుబ‌డిదారుల‌కు ల‌క్ష‌లాది రూపాయ‌ల రుణ మాఫీ చేస్తున్న ఈ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఏమ‌నాలో అర్థం కావ‌డం లేదు. అన్నారు సీఎం కేసీఆర్‌. ఇవ్వాల (ఆదివారం) న‌ల్గొండ జిల్లా చండూరు మండ‌లంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. పెట్టుబ‌డిదారుల‌కు కొమ్ముకాస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలే అని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement