Sunday, May 5, 2024

ఒకే అమ్మాయితో కోహ్లి, రోహిత్ ఎఫైర్.. ఇదే వారి మధ్య చిచ్చుకు కారణమా?

గత ఏడాది దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎడమొహం, పెడమొహంగా ఉన్నారు. దీనికి కారణం ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎట్టకేలకు వీరి మధ్య దూరానికి కారణమైన ఓ నిజం ఆలస్యంగా బయటపడింది.

గతంలో ఎంద‌రో క్రికెట‌ర్లు బాలీవుడ్ హీరోయిన్‌లతో చెట్టాప‌ట్టాలు వేసుకుని తిరిగారు. అందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. క్రికెటర్లకు సినీ తారల మధ్య డేటింగ్‌లు, అఫైర్లు ఉండటం కొత్తేమీ కాదు. అయితే రోహిత్ శర్మకు, బిగ్‌బాస్ బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ సోఫియా హయత్ మధ్య ఉన్న అఫైర్ మరోసారి మీడియాలో వైరల్‌గా మారింది. నిజం చెప్పాలంటే సోఫియా హయత్ తన ప్రతిభ కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతోనే అత్యంత పాపులారిటీ సంపాదించింది. హిందీ బిగ్‌బాస్-7లో పాల్గొన్న అనంతరం ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో సోఫియాతో అప్పట్లో క్రికెటర్ రోహిత్ శర్మ అత్యంత సన్నిహితంగా మెలిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. వారిద్దరి ప్రేమ వ్యవహారం ఎంత వేగంగా ముందుకు కదిలిందో.. అంతే వేగంగా బ్రేకప్ కూడా జరిగింది. వీరి ప్రేమ వ్యవహారం విఫలం కావడానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లి అన్న టాక్ నడుస్తోంది.

ఎందుకంటే రోహిత్‌తో ప్రేమ సాగుతున్నప్పుడే సోఫియాతో కోహ్లీ రిలేషన్‌లో ఉన్నాడని తెలుస్తోంది. ఇది మీడియాలో హైలెట్ కావడంతో రోహిత్‌తో బ్రేకప్ గురించి సోఫియా హయత్ సంచలన ట్వీట్ చేసింది. విరాట్ కోహ్లీ మైదానం లోపల, బయట మంచి ఆటగాడు అని, అందుకే రోహిత్‌ను వదులుకున్నట్లు సోఫియా తన ట్వీట్‌లో పేర్కొనడంతో వారి బ్రేకప్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఈ వివాదం నుంచే కోహ్లీకి, రోహిత్‌కు పడదు అని టాక్ కూడా ఉంది. అందుకే వీరిద్దరి మధ్య తరుచూ వివాదాలు జరుగుతున్నాయని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement