Friday, April 26, 2024

వకీల్ సాబ్ డైరెక్టర్ తో న్యాచురల్ స్టార్ నాని ?

డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను సాధించింది. అయితే ఇది ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది.

మొదట అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. కానీ అది పట్టాలెక్కేలా కనిపించడం లేదు. కాగా తాజా సమాచారం ప్రకారం వేణు శ్రీరామ్ న్యాచురల్ స్టార్ నానికి ఓ లైన్ చెప్పాడట. ఆ లైన్ బాగా నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలని నాని కోరాడట. ఒకవేళ నానికి ఆ స్క్రిప్ట్ నచ్చితే శ్యామ్ సింగ రాయ్ సినిమా తర్వాత ఈ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వేణు శ్రీరామ్ నాని గతంలో ఎంసీఏ సినిమా చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement