Thursday, May 9, 2024

విక్రాంత్ రోణ ట్రైల‌ర్ – పోలీస్ ఆఫీస‌ర్ గా కిచ్చా సుదీప్

స్టార్ హీరో కిచ్చా సుదీప్ న‌టిస్తోన్న విక్రాంత్ రోణ చిత్రం నుండి ట్రైల‌ర్ రిలీజ్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నడుస్తుంది.
కన్నడతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లోను ఈ సినిమాను జులై 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను వదిలారు. ”అది ఒక మర్మమైన ఊరు .. ఆ ఊరు ప్రజలు ఒక భయంకరమైన నిజాన్ని దాచాలనుకుంటున్నారు. కథను దాచగలరుగానీ .. భయాన్ని దాచలేరు” అనే వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ నడిచింది. ఆ ఊరిలోని రహస్యాన్ని ఛేదించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ గా సుదీప్ కనిపిస్తున్నాడు. నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ బాగున్నాయి. కంటెంట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నీతా ఆకాశ్ .. జాక్విలిన్ .. నిరూప్ భండారి .. రవిశంకర్ గౌడ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement