Sunday, May 5, 2024

Spl Story | బీటౌన్​లో లవ్​ జంట.. బోల్డ్​ సీన్స్​, రోమాన్స్​తో రెచ్చిపోతున్న తమన్నా!

వరుస వెబ్​ సీరిస్​లు, హాట్​ హాట్​ ఎపిసోడ్​లతో నెట్​ఫ్లిక్స్​, హాట్​స్టార్​ వంటి ఓటీటీల్లో తమన్నా అందాలను ఆరబోస్తోంది.​ ఆన్‌స్క్రీన్​ రొమాన్స్​తో పాటు, ఆఫ్​ స్ర్కీన్​లోనూ ఎంజాయ్​ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. మొన్న జీ కర్దాలో బోల్డ్​ సీన్స్​.. ఇప్పుడు ఏకంగా లస్ట్​ స్టోరీ–2లో మరీ రెచ్చిపోయేలా ఉన్న సీన్స్​లో కనిపించింది ఈ అమ్మడు. ఇక.. బీటౌన్​లో తమన్నా, ఆమె బోయ్​ఫ్రెండ్​ విజయ్​వర్మ గురించే చర్చించుకుంటున్నారు. ఓర్నీ ఇదా సంగతి అంటూ గుసగుసలు పోతున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

బాలివుడ్​లో అందరి అభిమానాన్ని చూరగొని, మిల్కీబ్యూటీగా పేరు తెచ్చుకుంది తమన్నా. హీరోయిన్​గా అవకాశాలు తగ్గడంతో సరికొత్త రూపంలోకి మారిపోయింది. ఆ మధ్య నితిన్​ హీరోగా వచ్చిన మ్యాస్ట్రో సినిమాలో లేడీ విలనిజాన్ని పండించి మెప్పించింది. ఆ తర్వాత ఓటీటీల్లో వరుస వెబ్​సిరీస్​లలో కనిపిస్తోంది. ఇప్పుడేమో మరీ బోల్డ్​ సీన్స్​లోనూ నటిస్తూ అభిమానులకు మతిపోగోడుగోంది.

ఇక.. ఇప్పుడు బి-టౌన్‌లో సరికొత్త జంట ఎవరయ్యా అంటే.. తమన్నా భాటియా, ఆమె బోయ్​ఫ్రెండ్​ విజయ్​వర్మ పేరునే చెబుతున్నారు. లస్ట్ స్టోరీస్ 2 లో కలిసి వీరి నటించారు. నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన ఈ వెబ్​సిరీస్​ షూటింగ్ సమయంలో వారి రిలేషన్​ షిప్ ప్రారంభమైనట్టు వారే అంగీకరించారు.​ అయితే.. ఈ సిరీస్​ జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సమీక్షకులు దీనిపై పాజిటివ్​ కామెంట్స్​ చేయలేదు. కానీ, నెటిజన్లు అయితే వారిద్దరి ఆఫ్-స్క్రీన్ రొమాన్స్ ను ఇష్టపడుతున్నారు. ఎయిర్‌పోర్ట్ స్పాటింగ్‌ నుండి బర్త్​డే ఫోటోల వరకు… వారి డేటింగ్​కు సంబంధించిన పుకార్లకు దారితీసిన అనేక సంఘటనలు ఇక్కడ చూడొచ్చు. విజయ్ వర్మ, తమన్నా భాటియా రిలేషన్​షిప్​కు సంబంధించిన టైమ్‌లైన్ పరిశీలిద్దాం..

డిసెంబర్ 2022

- Advertisement -

తమన్నా పుట్టినరోజు సందర్భంగా నటుడు నటుడు విజయ్​వర్మ ఆమె ఇంటికి వచ్చాడు. వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ సెట్స్ లో ఫ్రెండ్స్​గా మారారు. ఇక అప్పటి నుంచి రెగ్యులర్​గా కలుస్తూ వస్తున్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా..

అప్పటిదాకా తమన్నా, విజయ్​వర్మ మధ్య ఉన్న రిలేషన్​ పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే అప్పటికే కొన్ని ఊహాగానాలు వచ్చాయి. కాగా, ఇక్కడున్న ఫొటో విమానాశ్రయంలో కనిపించింది. గోవాలో నూతన సంవత్సర వేడుకల్లో తమన్నా, విజయ్​వర్మ ఇద్దరూ పాల్గొన్నారు. వారిద్దరూ సాన్నిహిత్యంగా ఉండడమే కాకుండా కిస్​ (ముద్దు) చేసుకోవడం ఫొటోలో చూడవచ్చు. వైరల్ అయిన వీడియోలలో ఇది ఒకటి. 2023వ సంవత్సరాన్ని స్వాగతిస్తున్నప్పుడు బిగ్గరగా కౌగిలించుకోవడం, ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం చూడొచ్చు.ఈ సందర్భంగాలో తమన్నా క్యూట్ పింక్  డ్రెస్​లో కనిపించగా, విజయ్​ వర్మ తెల్లటి షర్ట్​ ధరించాడు.

ప్రేమికుల రోజు..

37 ఏళ్ల నటుడు విజయ్​వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు జతల పాదాల ఫొటోని, రెడ్​ కలర్​లో లవ్​ సింబల్​ని పోస్ట్ చేశాడు. వారి రిలేషన్​ని సూచిస్తూ ఈ ఫొటో షేర్​ చేసినట్టు తెలుస్తోంది. వీళ్లిద్దరూ ఇంతకుముందు ఒక అవార్డ్ ఫంక్షన్‌కు కూడా హాజరయ్యారు. అక్కడ వారు ఒకే కారులో నుంచి దిగడం కూడా గమనించవచ్చు.

ఏప్రిల్ 2023

తమన్నా, విజయ్​వర్మ కలిసి కారులో చక్కర్లు రైడ్​కి వెళ్లారు. వర్మ కారు నడుపుతుండగా, తమన్నా డ్రైవ్‌ను ఎంజాయ్​ చేసినట్టు ఆ ఫొటో ఉంది.

మే 2023

నటుడు గుల్షన్ దేవయ్య, ట్రైలర్ లాంచ్ సందర్భంగా.. విజయ్‌ని తమన్నా పేరుతో పదే పదే ప్రస్తావించారు. వారి మధ్య అప్పటికే గాఢమైన బంధాన్ని ఈ సందర్భంగా అందరూ గమనించారు.

జూన్ 2023 ఫిల్మ్ కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి నటి తన రిలేషన్​ షిప్​ని అంగీకరించింది. తాము ఇద్దరం రిలేషన్​షిప్​లో ఉన్నట్టు వెల్లడించింది. అతనంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే తనతో కలిసి సాగుతున్నట్టు తమన్నా ఈ సందర్భంగా వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement