Thursday, May 9, 2024

వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ కిడ్నాప్-బ‌ల‌వంతంగా పెళ్లి

అత‌నో వెట‌ర్న‌రీ డాక్ట‌ర్..త‌మ ఇంట్లో ఉన్న జంతువుకి ఆరోగ్యం బాగోలేద‌ని ఫోన్ చేసి బ‌య‌టికి ర‌ప్పించారు ప‌లువురు. అత‌ను బ‌య‌టికి రాగానే కిడ్నాప్ చేసి బ‌ల‌వంతంగా పెళ్లి చేశారు. ఈ సంఘ‌ట‌న బిహార్‌లోని బెగుసరాయ్ ప్రాంతంలో వెలుగు చూసింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఏదో జంతువుకు ఒంట్లో బాగలేదని కాల్ వచ్చింది. అక్కడికి వెళ్లిన తర్వాత అతన్ని ముగ్గురు వచ్చి కిడ్నాప్ చేశారు. తను తిరిగి రాకపోవడంతో ఇంట్లో అందరం చాలా టెన్షన్ పడిపోయి పోలీసులను ఆశ్రయించామ‌ని డాక్టర్ బంధువులు తెలిపారు. కాగా ఇలాంటి ఘటనలు బిహార్‌లో చాలా జరుగుతుంటాయి. పకడ్వా వివాహ్ అనే పేరుతో పిలిచే ఈ పెళ్లిళ్లలో.. జీవితంలో సెటిల్ అయిన అబ్బాయిలను ఇలా కిడ్నాప్ చేసి, తమ పిల్లలకు ఇచ్చి పెళ్లి చేస్తుంటారు. ఈ క్రమంలో అబ్బాయిల తలలపై తుపాకులు గురిపెట్టి తాళి కట్టిస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement