Sunday, May 5, 2024

ఇవాళ సాయంత్రం నుంచి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

మే 1వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానుంది. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయాల్లో కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి టీకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్రం తెలిపింది. టీకా తీసుకోవాలనుకునే వారు కోవిన్ వెబ్‌సైట్‌తో పాటు ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు. మే 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసిన టీకా కేంద్రాల ఆధారంగా అపాయింట్‌మెంట్ ఖరారవుతుందని ట్విట్టర్ ద్వారా కేంద్రం వెల్లడించింది.

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి

✪ కోవిన్ పోర్ట‌ల్ (cowin.gov.in) లాగిన్ అవ్వండి.
✪ మొబైల్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి Get OTPపై క్లిక్ చేయండి.
✪ మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.. దానిని వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసి వెరిఫై బటన్‌పై క్లిక్ చేయండి
✪ రిజిస్ట్రేషన్ ఫర్ వ్యాక్సిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఫోటో గుర్తింపు కార్డు ఎంచుకోవాలి
✪ గుర్తింపు కార్డు నంబ‌ర్‌తో పాటు పేరు, పుట్టిన సంవ‌త్స‌రం వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవాలి
✪ వివరాలు పూర్తి చేశాక రిజిస్ట‌ర్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి
✪ రిజిస్ట్రేష‌న్ చేసుకున్న తర్వాత ఏ రోజు టీకా వేయించుకోవాలో షెడ్యూల్ చేసుకోవాలి
✪ షెడ్యూల్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి
✪ మ‌రో పేజి ఓపెన్ అవుతుంది. మీ ఏరియా పిన్ కోడ్ ఎంట‌ర్ చేయండి
✪ టీకా కేంద్రాల లిస్టు వస్తుంది. అందులో తేదీ, స‌మ‌యాన్ని సెలెక్ట్ చేసుకోండి
✪ క‌న్ఫార్మ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేస్తే చాలు.. మీ టీకా రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్టే

Advertisement

తాజా వార్తలు

Advertisement