Saturday, May 4, 2024

వ్యాక్సినేష‌న్ లో భార‌త్ మ‌రో ఘ‌న‌త .. ట్వీట్ చేసిన ప్ర‌ధాని మోడీ ..

క‌రోనా క‌ట్ట‌డికి మాస్క్ ఒక్క‌టే కాదు వ్యాక్సిన్ కూడా ఎంతో ముఖ్యం.. దాంతో అన్ని దేశాల‌తో పాటు భార‌త్ లో కూడా క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ముమ్మ‌రంగా కొన‌సాగుతుంది. కాగా ఒమిక్రాన్ వేరియంట్ నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ని మ‌రింత వేగాన్ని పెంచారు. దాంతో సోమ‌వారం నాటికి కోవిడ్ వ్యాక్సినేష‌న్‌లో భార‌త్ మ‌రో ఘ‌న‌త సాధించింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. టీకాలు తీసుకోవ‌డానికి అర్హులైన దేశ జనాభాలో 50 శాతం మందికి పూర్తి స్థాయిలో టీకాలు (రెండు డోసుల వ్యాక్సిన్‌) ఇచ్చిన‌ట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నాటికే భార‌త్ ల‌క్ష్యాన్ని చేరుకుంద‌ని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆదివారం నాటికి మొత్తం 127 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశామ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

కాగా ఇందులో మొద‌టి డోసు తీసుకున్న‌వారు 80 కోట్ల మంది ఉన్నారు. క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న‌వారు 47.9 కోట్ల మంది మంది ఉన్నారు. ప్ర‌స్తుతం రెండు డోసులు తీసుకున్న‌వారు ఆర్హులైన వారిలో స‌గం మంది ఉన్నార‌ని మంత్రిత్వ శాఖ వివ‌రించింది. క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి అర్హులైన వారిలో స‌గం మందికి రెండు డోసులు వ్యాక్సిన్ ఇచ్చి మ‌రో మైలురాయికి భార‌త్ చేరుకోవ‌డంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్పందించారు. ‘భారత్ క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో మరో మైలురాయిని అందుకుంది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా కొన‌సాగుతున్న ఈ పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇదే వేగంగా ముందుకు వెళ్ల‌డం అత్యంత ముఖ్య‌మైన‌ది. దీనికి సానుకూలంగా ప్ర‌జ‌లు మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం కీల‌కం. అలాగే, క‌రోనా నిబంధ‌న‌లు సైతం పాటించండ‌ని మోడీ ట్వీట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement