Thursday, April 25, 2024

Razole: ఎమ్మెల్యే రాపాకకు నిరసన సెగ.. ‘గో బ్యాక్’ అంటూ ఫ్లెక్సీలు

తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు నిరసన సెగ తగిలింది. రాజోలు మండలం కాట్రేనిపాడు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రావద్దంటూ ప్లెక్సీలు వెలిశాయి. ఎమ్మెల్యే రాపాక ‘గో బ్యాక్’ అంటూ జనసేన కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జనసేన గుర్తుతో గెలచి పార్టీకి ఎమ్మెల్యే రాపాక ద్రోహం చేసారంటూ జనసేన కార్యకర్తలు నిలదీసేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement