Saturday, May 4, 2024

Breaking: జ‌గ్గారెడ్డితో ఉత్త‌మ్ భేటీ.. పార్టీ వీడ‌కుండా మంత‌నాలు

ప్రభన్యూస్ బ్యూరో​, ఉమ్మడి మెదక్​: కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డి పార్టీ వీడ‌తాన‌ని చెప్ప‌డంతో ఆ పార్టీలో కొంత‌మంది అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కాలం పార్టీకి సేవ‌లందిస్తే స‌రైన ప్ర‌యారిటీ ద‌క్క‌డం లేద‌ని అధిష్ఠానంపై మండిప‌డుతున్నారు. అయితే జ‌గ్గారెడ్డిని పార్టీలోనే ఉండేలా స‌ముదాయించ‌డానికి ఏపీ కాంగ్రెస్ లీడ‌ర్ సాకె శైల‌జానాథ్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇవ్వాల (శనివారం) రాత్రి ఎంపీ, పీసీసీ మ‌జీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా జ‌గ్గారెడ్డికి ఫోన్ చేసి త‌న నివాసానికి పిలుపించుకున్నారు. ఉత్త‌మ్ నివాసంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఏఐసీసీ సెక్ర‌ట‌రీ సంప‌త్‌కుమార్‌, యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు శివ‌సేన‌రెడ్డి, బోల్లు కిష‌న్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement