Tuesday, May 14, 2024

అమెరికా ప్రతీకార చర్య… ఆఫ్ఘన్ లోని ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం

కాబుల్​ విమానాశ్రయం వద్ద ఐసిస్​-కే జరిపిన జరిగిన వరుస బాంబు పేలుళ్లకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటోంది. అఫ్గానిస్థాన్​లోని ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో  దాడులుచేసింది. నాంగ్‌హార్ ప్రావిన్స్‌లో అమెరికా వాయుసేన ఈ మానవ రహిత వాయు దాడులకు దిగింది. తాము అనుకున్న లక్ష్యాన్ని ఛేదించినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ విలియం అర్బన్ తెలిపారు. ఈ దాడుల్లో పౌరులకు ఎలాంటి హానీ జరగలేదని పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ విమానాశ్రయం వద్ద గురువారం(ఆగస్ట్ 26) జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 200 వరకు చేరుకుంది. వీరిలో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటాడి చంపుతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం 48 గంటల్లోనే ఐసిస్ స్థవరాలపై అమెరికా సైన్యం ఈ దాడులకు పాల్పడడం గమనార్హం.

ఇది కూడా చదవండిః టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఎఫ్ క్లబ్ చుట్టూ నడిచిన వ్యవహారం!

Advertisement

తాజా వార్తలు

Advertisement