Friday, May 17, 2024

కరోనా కారణంతో చేర్చుకోలే.. ఆస్పత్రి బయటే ప్రసవం.. ఇద్దరిని సస్పెండ్​ చేసిన మంత్రి

ప్రభుత్వ హాస్పిటల్​లో కొవిడ్​ పేషెంట్​, గర్భిణిని చేర్చుకోబోమని చెప్పినందుకు ఇద్దరిని సస్పెండ్​ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కొవిడ్ పాజిటివ్ గర్భిణీ గిరిజన మహిళను చేర్చుకోవడానికి ప్రభుత్వ ఆస్పత్రి నిరాకరించింది. కాగా, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆసుపత్రి వైద్యుడిని సస్పెండ్ చేశారు.  బల్మూర్ మండలం బాణాల ప్రాంతానికి చెందిన చెంచు తెగకు చెందిన నిమ్మల లాలమ్మ తన బిడ్డ ప్రసవం కోసం మంగళవారం ఆ ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంది. ఆమె అడ్మిట్‌ కోసం వెయిట్​ చేస్తుండగా పరీక్షించిన వైద్యులు ఆమెకు కొవిడ్‌ పాజిటివ్‌ అని తెలుసుకుని నాగర్‌కర్నూల్‌లోని మరో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, మహిళ కోసం అంబులెన్స్ ఏర్పాటు చేయలేదు.

కాగా, గర్భిణి తల్లి  ప్రసవ నొప్పులను గమనించి ఆమె తోబుట్టువుల సాయంతో చివరికి హాస్పిటల్​ గేట్‌కి సమీపంలో ఉన్న బహిరంగ ప్రదేశంలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇది చూసిన ఆస్పత్రి సిబ్బంది లాలమ్మను తీసుకెళ్లి గది ఇచ్చారు. ఈ దారుణ  నిర్లక్ష్యం, వివక్షను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ఆరోగ్య మంత్రి టి హరీష్ రావు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ,  ఆన్ డ్యూటీ డాక్టర్  హరిబాబును సస్పెండ్ చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్, ఇద్దరు వైద్యుల సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తూ “గర్భిణీ స్త్రీలు కొవిడ్ -19 పాజిటివ్‌గా ఉన్నప్పటికీ వారిని అడ్మిషన్‌ను తిరస్కరించవద్దని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనను చాలా సీరియస్​గా తీసుకోవాలని,  సంబంధిత సిబ్బంది ఏ చిన్న పొరపాటు చేయద్దన్న  నిబంధనలు జారీ చేశారు” ..  ఈ విషయమై నాగర్‌కర్నూల్‌లోని జిల్లా కేంద్రాసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరణ ద్వారా తన నివేదిక అందజేయాలని అధికారులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement