Thursday, May 2, 2024

స్మశాన వాటిక వద్ద బిక్కుబిక్కుమంటున్న కరోనా బాధితులు

కరోనా రక్కసి మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. కరోనా సోకుతుందనే భయంతో ఎవరికైనా పాజిటివ్ నిర్ధారణ అయితే వారి పట్ల కొందరు దారుణంగా వ్యవహరిస్తున్నారు. గ్రామస్తుల తీరుతో మనస్తాపం చెంది స్మశాన వాటిక బిక్కుబిక్కుమంటూ కరోనా బాధితులు తలదాచుకున్న సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఏన్మాన్ బెట్ల గ్రామానికి చెందిన ఇద్దరికి కరోన పాజిటివ్ వచ్చింది. వారికి ఉండడానికి ఒక్కే గది ఉండడంతో కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుందని  గ్రామ సర్పంచ్ పాశం నాగరాజు వారిని ప్రభుత్వ పాఠశాలలో  ఉచ్చారు.  అయితే పాఠశాల చుట్టూ పక్కల ఉన్న గ్రామస్తులు కరోనా బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  చుట్టూ ఇళ్లు ఉన్నాయని, మీరు వెళ్లిపోండి అంటూ తెగేసి చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన కరోనా బాధితులు చేసేది లేక స్మశాన వాటికలో పాడుబడిన రేకుల గదిలో ఉన్నారు. రాత్రి కరెంటు కూడా లేకపోవడంతో  బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నారు. తమని పట్టించుకొనే వారే లేరని బాధితులు వాపోయారు.  గ్రామ సర్పంచ్ చెప్పినా పాఠశాల చుట్టూ ఉన్న ఇళ్లు వారు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, సర్పంచ్ నాగరాజు స్పందించి కరోనా బాధితులను మళ్ళీ పాఠశాలలో పెట్టారు. బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సర్పంచ్ హెచ్చరించడంతో గ్రామస్థులు మౌనంగా ఉండిపోయారు. కరోనాపై  అవగాహన కల్పిస్తున్న గ్రామాలలో ఇంకా మార్పు రావడం లేదు. గ్రామస్థలు తీరుతో కరోనా బాధితులు చాలా బాధలు అనుభవిస్తున్నారు. మానవత్వంతో కొన్ని చోట్ల కరోనా మృతిదేహాలకు దహన సంస్కరణలు నిర్వహిస్తున్న.. కొందరు మారటం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement