Friday, May 17, 2024

పోలీసులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడి చిందులు

తెలంగాణలో లాక్‌డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఎవరైనా అనవసరంగా రోడ్లపైకి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనల్ని పాటించని నేతలు, అధికారుల్ని సైతం పోలీసులు క్షమించడం లేదు. తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తమ్ముడు దాసరి అంజా రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నడిరోడ్డుపై పోలీసులపై చిందులు వేశారు. ఓ ఎమ్మెల్యే సోదరుడిని అడ్డుకుంటారా? అంటూ ప్రశ్నించాడు. తాను రైతును అని ధాన్యం అమ్ముకునేందుకు వెళ్లాలని ఓ సారి, పెళ్లికి వెళ్తున్నానంటూ మరోసారి పోలీసులకు తలా తోక లేని సమాధానాలు చెప్పి ముప్పుతిప్పలు పెట్టాడు. అనంతరం పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

పోలీసులు తనకు కావాలంటే ఫైన్ వేస్తే కడతానన్నాడు. కానీ ఇక్కడ ఆగే ఓపిక తనకు అస్సలు లేదంటూ పోలీసులపై అంజారెడ్డి చిందులేశాడు. ఈ పాస్ కచ్చితంగా చూపించాలని పోలీసులు అంజారెడ్డిని అడగడంతో రైతులకు ఆన్ లైన్‌లో పాస్ తీసుకోవడం ఎలా సాధ్యం.. ? మీరు ఏం చేస్తారో చేసుకోండంటూ గంటసేపు నానా హడావుడి చేశాడు. దీంతో ఈ విషయం తెలిసిన ఎస్సై ఘటనా స్థలికి చేరుకున్నారు. వారించి అంజారెడ్డి కారు నెంబర్ నోట్ చేసుకొని పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement