Sunday, May 5, 2024

Twitter | ఏఎన్​ఐకి ట్విట్టర్​ షాక్​.. వయస్సు సరిపోవడం లేదని లాక్​ చేస్తున్నట్టు వెల్లడి

ట్విట్టర్​ సిబ్బంది అవగాహనరాహిత్యం వల్ల ఏఎన్​ఐ (ఆసియా ప్రీమియర్​ న్యూస్​ ఏజెన్సీ, ఇండియా న్యూస్​) మీడియా సంస్థ లాక్​ అయ్యింది. ఈ విషయాన్ని ANI ఎడిటర్ స్మితా ప్రకాష్ శనివారం తెలిపారు. ‘‘మైక్రోబ్లాగింగ్ సైట్‌ను ఉపయోగించడానికి మీ కనీస వయస్సు సరిపోలడం లేదు.. కాబట్టి, ట్విట్టర్ ఆసియా న్యూస్ ఇంటర్నేషనల్ (ANI) ఖాతాను లాక్ చేసింది’’ అని ట్విట్టర్​ వెల్లడించింది. దీంతో ఆ వార్తా సంస్థకు చెందిన ట్విట్టర్ హ్యాండిల్ ప్రస్తుతం యాక్టివ్​లో లేదు అనే మెస్సేజ్​ వస్తున్నట్టు ఎడిటర్​ వివరించారు. అంతేకాకుండా ANI హ్యాండిల్ లాక్ అయినట్టు తెలిపే ట్విట్టర్ ఇ–మెయిల్ చిత్రాన్ని స్మితా ప్రకాష్ ట్వీట్ చేశారు.

‘‘ట్విటర్ ఖాతాను ఓపెన్​ చేయడానికి మీకు కనీసం 13 సంవత్సరాలు ఉండాలి. మీరు ఈ వయస్సు అవసరాలకు అనుగుణంగా లేరని Twitter నిర్ధారించింది, కాబట్టి మీ ఖాతా లాక్ చేశాం. అందుకనే Twitter నుండి ఈ సంస్థ తొలగిస్తున్నాం’’ అని మరో ఇమెయిల్ పంపించినట్టు ఎడిటర్​ స్మితా ప్రకాశ్​ తెలిపారు..

ఇక.. ఏఎన్​ఐ వార్త సంస్థ.. దక్షిణాసియాలో ప్రీమియర్ మల్టీమీడియా వార్తా సంస్థగా ఉంది.  భారతదేశంతోపాటు, దక్షిణాసియా, ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ బ్యూరోలను కలిగి ఉంది. అయితే.. ఎలోన్ మస్క్ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్​ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, దాని సిబ్బందిని తగ్గించారు. అప్పటి నుంచి వినియోగదారులు ఇట్లాంటి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement