Monday, May 6, 2024

తెలంగాణ శ్వేత సౌధం ప్రారంభోత్సవం.. ట్రాఫిక్​ డైవర్షన్​, ఆంక్షలుంటయ్​

తెలంగాణ చరిత్రలో మరో కలికితురాయిగా నిర్మితమైన నూతన సచివాలయం రేపు (ఏప్రిల్ 30 ఆదివారం) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉదయం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హుస్సేన్ సాగర్‌‌, సైఫాబాద్‌, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు. అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీపార్క్‌, నెక్లెస్‌ రోడ్డును పూర్తిగా మూసి వేస్తున్నట్టు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

వీఐపీల రాకపోక నేపథ్యంలో.. వీవీ విగ్రహం, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగు తల్లి జంక్షన్‌ వరకు ఇరువైపుల అప్పటి పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ను నిలిపివేయడం, ట్రాఫిక్ మళ్లింపులు చేయడం జరుగుతుందని ట్రాఫిక్​ అడిషనల్​ సీపీ తెలిపారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీద ట్రాఫిక్ కు అనుమతి లేదన్నారు. ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి, బీఆర్‌‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌‌ మార్గ్‌ రూట్‌ లలో ఎలాంటి వాహనాలకూ అనుమతి లేదన్నారు. సచివాలయ ప్రారంభోత్సానికి వచ్చే ఆహ్వానితుల కోసం పార్కింగ్ స్థలాలను కేటాయించామని, ప్రారంభోత్సవానికి వచ్చే వారంతా తమ వాహనాలకు పాస్ లను కచ్చితంగా స్టిక్ చేసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement