Thursday, May 2, 2024

ధూమ్ ధామ్ ద‌స‌రా.. నెట్‌ఫ్లిక్స్ టాప్ 1, 3లో ట్రెండింగ్​

యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ లవ్ ఎమోషనల్ మూవీ దసరా. ఇటీవల థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీ దగ్గర భారీ విజయం సొంతం చేసుకుని హీరోగా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కాగా, రెండు రోజుల క్రితం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది దసరా మూవీ. మల్టీ లాంగ్వేజ్ లో తెర‌కెక్కిన ఈ సినిమాకి.. ఆడియన్స్ నుండి ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది.

- Advertisement -

అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం దసరా మూవీ తెలుగు వర్షన్ టాప్ 1 గా అలానే తమిళ్ వర్షన్ టాప్ 3 గా తమ ఓటిటిలో ఇండియా వైడ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ విశ‌యాన్ని నెట్‌ఫ్లిక్స్ వారు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మొత్తంగా అటు థియేటర్స్ లో ఇటు ఓటిటిలో దసరా సినిమాకి ఇంత మంచి ఆదరణ లభించడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement