Sunday, April 28, 2024

TSRTC రంజాన్ స్పెషల్ ఆఫర్.. ఆ ఛార్జీలపై 25 శాతం డిస్కౌంట్

రంజాన్ సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. కార్గో సర్వీసు ఛార్జీలపై 25 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు ప్రకటించింది. ఆర్టీసీని గాడిన పెట్టేపనిలో భాగంగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో ప్రతీ పండగ సందర్భంగా కొత్త కొత్త డిస్కౌంట్లను ఆయన ప్రవేశపెడుతున్నారు. తాజాగా రంజాన్ మాసం సందర్భంగా ఆర్టీసీకి సంబంధించిన కార్గో, పార్శిల్ ఛార్జీలపై 25శాతం తగ్గింపు అందుబాటులో ఉంటుందని ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ నెల 24 నుంచి మే 3 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆఫర్‌ లో భాగంగా 5 కేజీల వరకు మాత్రమే ఈడిస్కౌంట్ వర్తిస్తుందని చెప్పారు. ప్రయాణికులు మరిన్ని వివరాలకు 040-30102829, 68153333 నంబర్లను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement