Friday, April 26, 2024

TSRTC: ఆర్టీసీకి సంక్రాంతి రికార్డు రాబడి.. ఆదాయం ఎంత వచ్చిందంటే..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు సంక్రాంతి పండుగ సందర్భంగా రికార్డు స్థాయి ఆదాయం రావడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. అధిక రాబడికి నిరంతర కృషి చేసిన సిబ్బంది, ఉద్యోగులు, అధికారులను మంత్రి అజయ్ అభినందించారు. పండుగ దృష్ట్యా నాలుగు వేల బస్సులను అదనంగా నడిపి దాదాపుగా 55 లక్షల మంది ప్రయాణీకులను ఎలాంటి అధనపు ఛార్జీలు లేకుండా ప్రజా సేవయే లక్ష్యంగా వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడం జరిగిందన్నారు.

TSRTC సాధారణ షెడ్యూల్ బస్సులకు అదనంగా సుమారు 4 వేల బస్సులను ఈనెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నడిపించింది. ఆర్టీసీలో సుమారు 55 లక్షల మంది ప్రయాణికులను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చామని ఆర్టీసీ ప్రకటించింది. తద్వారా ఆర్టీసీకి రూ.107 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి సమయంలో రోజుకు సుమారు రూ.15.2 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం ఊరటను, ఉత్సాహాన్నిచ్చింది. సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిందని ఆర్టీసీ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. కరోనాకు ముందు ఆర్టీసీకీ రోజుకు రూ.12 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చేది కానీ సంక్రాంతి సమయంలో రోజుకు సుమారు రూ.15.2 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనావేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement