Friday, May 17, 2024

టాప్ స్టోరీ : ‘స‌జ్జ‌నార్’ మ‌రో నిర్ణ‌యం..పెళ్ళిళ్ల‌కు బ‌స్సులు..న‌వ దంప‌తుల‌కు బ‌హుమ‌తులు..

స‌జ్జ‌నార్ సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు..ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలు వైర‌ల్ అవుతుంటాయి. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాద్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి నేటి వ‌ర‌కు ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారాయ‌న‌.. ఆయ‌న నిర్ణ‌యాలు, అనేక మార్పులతో తెలంగాణ ఆర్టీసీ దూసుకుపోతోంది. ప్రయాణికులకు.. ఆర్టీసీ సర్వీసుని దగ్గర చేసేందుకు అనేక ప్రణాళికలు రచిస్తోంది తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం. ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ ఆర్టీసీ.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పెళ్లి శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను బుక్ చేస్తే నూతన దంపతులకు సీల్డ్ ప్రదానం చేయాలని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం లో భాగంగానే నేడు నూతన జంటలకు బహుమతులను ప్రధానం చేసింది ఆర్టీసీ. నేడు ఒక్క రోజే ఐదు వందల వివాహాలలో 500 నవదంపతులకు ఆర్టీసీ తరఫున ప్రధానం చేశారు ఆర్టీసీ ఉద్యోగులు. ఇక తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement