Sunday, May 5, 2024

Spl Story: ఇండియాలో మోస్ట్​ ఫాలోయింగ్​.. టాప్​ 10లో ఉన్న భామలు వీరే, ప్రియాంకకు దక్కని చోటు

భారత సినీ రంగంలో ఎంతో మంది భామలు తమకంటూ ఓ ప్రత్యేకమైన టాలెంట్​తో కలకాలం నిలిచిపోయేలా సినిమాల్లో యాక్ట్​ చేస్తున్నారు. అయితే వీరిలో పాత తరం నటీమణుల నుంచి నేటి తరం కుర్ర హీరోయిన్ల దాకా చాలామంది తమకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్​ని ఏర్పరుచుకున్నారు. ఇందులో వారి గొప్ప నటనా చాతుర్యంతో పాటు, మనోహరమైన అందం, అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ ఉండడమే కాకుండా డిఫరెంట్ ఆటిట్యూడ్ కూడా మిలియన్ల మంది హృదయాలను గెలుచుకునేలా చేస్తోంది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది తమ ఫొటోలు, వీడియోలను ఇబ్బడిముబ్బడిగా షేర్ చేస్తూ ఫ్యాన్స్​కి నిత్యం టచ్​లో ఉంటున్నారు. వారి హృదయాలను కొల్లగొడుతున్నారు. కొంతమంది తారలైతే వారి రోజువారీ దైనందిన కార్యక్రమాలను కూడా షేర్ చేస్తున్నారు. ఇంకొందరు పెట్టే పిక్స్ అయితే.. ఫ్యాన్స్​తో కుర్రకారుని కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అందులో ఈమధ్య మీడియా పరిశీలనల మేరకు ఫ్యాన్ ఫాలోయింగ్​ని మరింత పెంచుకున్న వారిలో సమంత టాప్ ప్లేస్​లో నిలుస్తోంది. 

సినీ తారల తాజా ప్రజాదరణ జాబితాను చూస్తే.. దేశమంతటా తమ మ్యాజిక్‌ను వ్యాప్తి చేయడానికి ఎటువంటి అవకాశాలను వదిలిపెట్టడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఈ జాబితాలో సమంత రూత్ ప్రభు అగ్రస్థానంలో ఉండగా, ఆలియా భట్, నయనతార, దీపికా పదుకొణె తర్వాతి స్థానాల్లో నిలిచారు. దక్షిణాది నటీమణులు ఏడు స్థానాలతో టాప్ 10 జాబితాలో ఉన్నారు. అయితే.. బాలీవుడ్ నుంచి కత్రినా, అలియా, దీపిక మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఇక.. ఇప్పటిదాకా అందరినీ అలరించి, మైమరిపించిన గ్లోబల్ స్టార్, ఇండియన్ చిన్నది అయిన ప్రియాంక చోప్రాకు టాప్ 10 జాబితాలో ఈసారి ప్లేస్ దక్కలేదు. ఈ లిస్ట్ లో స్థానం కోల్పోవడం వెనుక ఆమె కొంతకాలంగా బాలీవుడ్‌కు దూరంగా ఉండడమే కారణమని చాలామంది అనుకుంటున్నారు. కాగా, ప్రియాంక చోప్రా ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి ఉంటోంది.

- Advertisement -

ఆమె తన హాలీవుడ్ ప్రాజెక్ట్స్ – టెక్స్ట్ ఫర్ యు.. సిటాడెల్‌పై యాక్టివ్గా ఉంది. ఆమె తాజా బాలీవుడ్ ప్రాజెక్ట్ .. కత్రినా కైఫ్, అలియా భట్‌లతో కలిసి నటించిన “జీ లే జరా” మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. దీనికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక.. తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి నిర్మించిన “సంగీత్” అనే స్క్రిప్ట్ లేని సిరీస్ కూడా రన్నింగ్​లో ఉంది. అంతేకాకుండా ఆనంద్ షీలా జీవితంపై అమెజాన్ స్టూడియోస్‌తో ఓ చిత్రాన్ని కూడా ప్రియాంక నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

ఎక్కువ ప్రజాదరణ పొందిన హీరోయిన్ల జాబితా ఇదే..

1) సమంత

2) అలియా భట్

3) నయనతార

4) దీపికా పదుకొనే

5) కాజల్ అగర్వాల్

6) కీర్తి సురేష్

7) కత్రినా కైఫ్

8) రష్మిక మందన్న

9) పూజా హెగ్డే

10) అనుష్క శెట్టి

Advertisement

తాజా వార్తలు

Advertisement