Tuesday, May 7, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-వెండి రేటు

నేటి బంగారం ధ‌ర‌లు హైద‌రాబాద్ లో కాస్త పెరిగాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 52,470కు చేరింది. రూ. 130 మేర పెరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 100 పైకి ఎగసింది. పది గ్రాములకు రూ. 48,100కు ఎగసింది. కాగా బంగారం ధర గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. సిల్వర్ ధర రూ. 700 మేర పరుగులు పెట్టింది. దీంతో వెండి రేటు కేజీకి రూ. 64,700కు చేరింది. వెండి ధర రెండు రోజుల్లోనే రూ. 1200 మేర పెరిగింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలను గమనిస్తే.. పసిడి రేటు స్వల్పంగా పైకి చేరింది. 0.37 శాతం మేర పెరిగింది. ఔన్స్‌కు 1770 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఇది కనిష్ట స్థాయి అనే చెప్పుకోవచ్చు. ఇటీవల బంగారం ధర 1800 డాలర్ల పైన ట్రేడ్ అయ్యేది. అలాగే సిల్వర్ రేటు కూడా పెరిగింది. 0.55 శాతం పైకి చేరింది. దీంతో దీని రేటు ఔన్స్‌కు 19.22 డాలర్ల వద్ద కదలాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement