Sunday, May 5, 2024

కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర‌లు-ఎక్క‌డెక్క‌డ ఎంతెంతో చూద్దాం

నేటి బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి..హైద‌రాబాద్ మార్కెట్ లో బంగారం ధ‌ర రూ. 270 పడిపోయింది. దీంతో పసిడి రేటు రూ. 51,440కు తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్‌కు ఇది వర్తిస్తుంది. ఇంకా 22 క్యారెట్ల బంగారం రేటు అయితే రూ. 250 దిగొచ్చింది. 10 గ్రాములకు రూ. 47,150కు క్షీణించింది. పుత్తడి రేట్లు నిన్న కూడా నేలచూపులు చూసిన విషయం తెలిసిందే. ఏకంగా రూ.1000కు పైగా తగ్గింది. దీంతో పసిడి రేటు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రూ. 1300కు పైగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. కొనాలనుకునే వారికి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. విశాఖ పట్నం, విజయవాడ వంటి ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే రేట్లు ఉన్నాయి.పసిడి రేటు పడిపోతే.. వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. సిల్వర్ ధరలో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. వెండి రేటు కేజీకి రూ. 66 వేల వద్దనే కొనసాగుతోంది. కాగా వెండి రేటు గత రెండు రోజులుగా పడిపోతూనే వచ్చింది. ఏకంగా రూ. 1500 పతనమైంది. అయితే ఈరోజు మాత్రం ధరలో మార్పు లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement