Saturday, April 27, 2024

నేటి బంగారం ధ‌ర‌లు -త‌గ్గిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో బంగారం ధరలు(Gold Prices) మారలేదు. ఈ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే వెండి ధరలు మాత్రం కిందకి పడిపోయాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.46 వేల కింద రూ.45,800గా కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.49,970 వద్ద ఉంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతోన్న ఈ సమయంలో.. వెండి రేట్లు కిందకి దిగొచ్చాయి. కేజీ వెండి రేటు రూ.700 తగ్గి రూ.60 వేలుగా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు మారలేదు. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర(Gold Price) రూ.45,950గా, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.50,130 వద్ద కొనసాగుతున్నాయి. బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి రేటు తగ్గింది. వెండి రేటుపై కేజీ రూ.400 తగ్గి ఇది రూ.55 వేలుగా రికార్డయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement