Friday, May 3, 2024

కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం ?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వేళ.. రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరగబోతోందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగనున్నాయి. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో కీలక నేత, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్.. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే యోచనలో ఉన్నారని సమాచారం. టీజేఎస్ విలీనంపై ఇప్పటికే రేవంత్ రెడ్డితో కోదండరామ్ మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి గ్యారెంటి, టీజేఎస్ విలీనంపై క్లారిటీగా ఉన్నందునే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ లో చేరాలని కోదండరామ్ సూచించారని తెలుస్తోంది. టీఆర్ఎస్ కు ఈటల రాజీనామా చేసిన తర్వాత.. అతనితో పలు సార్లు కోదండరామ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. అయితే రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈటలతో ఈ ఇద్దరు నేతలు చర్చలు జరిపారని, కాంగ్రెస్ లో చేరాలని సూచించారని ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ జన సమితి పార్టీని స్థాపించిన కోదండరాం దానిని ప్రజల్లో తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలం అయ్యారు. అయితే, ఉద్యమ నేతగా కోదండరాంకు జనాల్లో గుర్తింపు ఉంది. ఇటీవల ఆయనే పోటీ చేసినా పట్టభద్రుల ఎమ్మల్సీగా ఓటమిపాలయ్యారు. ఇక పార్టీని నడిపించడం సాధ్యం కాదనే ఆలోచనకు వచ్చిన కోదండరామ్..  పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

మరోవైపు కాంగ్రెస్ లో టిజెఎస్ విలీనం వార్తలను కోదండరాం ఖండించారు. అలాంటి ఆలోచన తమకు లేదని, రేవంత్ నుండి కూడా ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. అయితే, రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరుగొచ్చు. రేపో మాపో టీజేఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లో రేవంత్ జోష్..

Advertisement

తాజా వార్తలు

Advertisement