Thursday, May 2, 2024

కాంగ్రెస్ లో రేవంత్ జోష్..

తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇన్నాళ్లు వ‌రుస‌గా ఓట‌మ‌లు, పార్టీ నాయకుల ఫిరాయింపులతో డిలా పడిన కాంగ్రెస్ లో ఇప్పుడు రేవంత్ రూపంలో కొత్త వెలుగు వచ్చింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామ‌కంతో ఆ పార్టీ వ‌ర్గాల్లో నూత‌నోత్తేజం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

ఒక‌ప్పుడు కాంగ్రెస్ మీటింగ్ అంటే నేత‌ల హాడావిడి మాములుగా ఉండ‌ది కాదు. హైదరాబాద్ న‌గ‌రం క‌టౌట్లు… గల్లీ గల్లీలో కాంగ్రెస్ తొరణాలు, ఉద‌యం నుండి జిల్లాల నుండి వ‌చ్చే నాయ‌కుల‌తో రాజ‌ధాని న‌గ‌రం సంద‌డిగా మారేది. అయితే, 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ఆ సంద‌డి క్ర‌మంగా తగ్గిపోగా… 2018 ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత గాంధీభ‌వ‌న్ లో కూడా హ‌డావిడి లేకుండా పోయింది. నాయ‌కులు కూడా వ‌చ్చామా… వెళ్లామా అన్న‌ట్లుగా మారిపోయారు.

కానీ, రేవంత్ రాక‌తో ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో క‌నిపించిన సంద‌డి క‌నిపిస్తోంది. ఎటూ చూసిన రేవంత్, కాంగ్రెస్ ఫ్లెక్సీలే దర్శనం ఇస్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల నుండి ఇంచార్జ్ లు, భ‌విష్య‌త్ లో టికెట్ ఆశించే నేత‌ల అనుచ‌ర‌గ‌ణం అంతా గాంధీభ‌వ‌న్ వైపే కదిలారు. గాంధీభ‌వ‌న్, రేవంత్ రెడ్డి ఇంటి ప్రాంతాల్లో అయితే తెల్ల‌వారుజాము నుండే నేత‌ల హ‌డావిడి మొద‌లైపోయింది. ఉదయమే ఆయన నివాసం వద్ద వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆ తరువాత తన నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి చేరుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాంధీభవన్‌కు రేవంత్ ర్యాలీగా బయల్దేరారు. నగరంలో ఎక్కడ చూసిన కాంగ్రెస్ జెండాలు రేపరేపలాడుతున్నాయి.

టీ.పీసీసీ కోసం ఎంత మంది సీనియర్లు పోటీ పడినా.. రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసే స్థాయికి వచ్చారు. అతి తక్కవ కాలంలో ఢిల్లీ స్థాయిలో ఉద్దండులు ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వాన్నే మెప్పించిన నేతగా రేవంత్ రికార్డు సృష్టించాడు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తరువాత తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ బీజేపీ మారింది. కానీ, ఇప్పుడు కేసీఆర్ వర్సస్ కాంగ్రెస్ అనే రేంజ్ కి వచ్చేంసింది. సీఎం కేసీఆర్ లక్ష్యంగా పని చేస్తూ..ఢిల్లీ స్థాయిలో పార్టీ అధినాయకత్వాన్ని ఆకర్షించారు.

ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ అయ్యారు. ఇక, తన నెక్ట్స్ టార్గెట్ ముఖ్యమంత్రి పదవి. ఇందు కోసం పీసీపీ పదవి రాగానే పార్టీ సీనియర్లను కలిసారు. అందరి సహకారం కోరారు. పార్టీలో అందరితో కలిసే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసారు. విభేదిస్తున్న నేతలు సహకారం అందించక తప్పని పరిస్థితి కల్పించారు. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి..

Advertisement

తాజా వార్తలు

Advertisement