Wednesday, May 15, 2024

ఉగాది రోజు ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ సినిమా లాంచ్

ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఏప్రిల్ 2వ తేదీ మ‌ధ్యాహ్నం 12:06 నిమిషాలకు టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాను లాంచ్ చేయనున్నారు. ఈ చిత్రంలో హీరోగా ర‌వితేజ న‌టించ‌నున్నాడు. అదే సమయంలో ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి వంశీ కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఆయన నుంచి మంచు లక్ష్మి ‘దొంగాట’ .. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాలు వచ్చాయి. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. రవితేజ నుంచి ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ కి రెడీగా ఉండగా, ‘ధమాకా’ .. ‘రావణాసుర’ సెట్స్ పై ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement