Thursday, November 30, 2023

Hyderabad: న్యూడ్ వీడియోలు షేర్ చేస్తాన‌ని బెదిరించి.. మ‌హిళ‌పై కానిస్టేబుల్ ప‌లుమార్లు ఆ పని..

న్యూడ్ వీడియోలు సోషల్​ మీడియాలో అప్‌లోడ్ చేస్తాన‌ని బెదిరించి.. వివాహితపై స్పెషల్​ బ్రాంచ్ కానిస్టేబుల్​ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైద‌రాబాద్‌లోని మీర్​ పేట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైదాబాద్​కు చెందిన పి. వెంకటేశ్వర్​ రావు (30) స్పెషల్​ బ్రాంచ్ కానిస్టేబుల్​ గా పనిచేస్తున్నాడు. అతని భార్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో చ‌నిపోయింది. అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహిత (34)తో పరిచయం చేసుకున్నాడు. ఆమె వెంటపడి వేధించడం మొదలు పెట్టాడు. 2021లో సైదాబాద్​లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి అసభ్యకరంగా ప్రవర్తించడానికి యత్నించిన కానిస్టేబుల్​పై ఆమె సైదాబాద్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

- Advertisement -
   

అప్పట్లో వెంకటేశ్వర్​ రావు పై ఐపీసీ 324 సెక్షన్​ కింద కేసులు నమోదు చేసిన సైదాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. కేసు నమోదు కావడంతో వెంటనే ఉన్నతాధికారులు అతనిపై సస్పెన్షన్​ వేటు వేశారు. జైలు నుంచి బ‌య‌ట‌కు వచ్చిన త‌ర్వాత వెంకటేశ్వర్​రావు తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఆ మ‌హిళ‌ను వేధించసాగాడు. ఆమె సైదాబాద్‌లోని జిల్లెల్​గూడకు మకాం మార్చినప్పటికీ వెంటపడుతున్నాడు. అక్టోబర్​ 17, 18, 19 తేదీలలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. అత్యాచార సమయంలో తీసుకున్న కొన్ని న్యూడ్​ వీడియోలు వెంటనే సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తానని, తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించసాగాడు.

ఇక‌.. ఈ నెల 11వ తేదీన కూడా మరో మారు సదరు కానిస్టేబుల్​ ఆమెపై అత్యాచారయత్నానికి యత్నించాడు. దీంతో బాధితురాలు మీర్​పేట్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేప్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న కానిస్టేబుల్​ వెంకటేశ్వర్​ రావు ను ఈ నెల 14వ తేదీన అరెస్ట్​ చేసి, రిమాండ్​కు తరలించారు. ఈ కేసును మీర్​పేట్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement