Monday, May 6, 2024

కాలేజీ డేస్‌లో నేను న‌డిపిన బైక్ ఇదే.. యాదిచేసుకున్న మంత్రి కేటీఆర్‌

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇవ్వాల (శనివారం) ఓ ఇంట్రెస్టింగ్ ఫొటోని షేర్ చేశారు. తాను స్టూడెంట్‌గా ఉన్న టైమ్‌లో నిజాం కళాశాలలో నడిపిన బైక్ ఉంద‌ని, అది ఇంకా చెక్కు చెదరలేదని తెలిపారు. 29 ఏళ్లు గడిచినా ఆ బైక్ మంచి కండిషన్ లోనే ఉంద‌ని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఫొటోలో ఉన్న‌ది త‌న బైకేనంటూ ఆయన సంబరపడిపోయారు. అంతేకాకుండా తన పాత బైక్ ను గుర్తు చేస్తూ కొన్ని జ్ఞాప‌కాల‌ను యాది చేసుకుంటూ జాన్సన్ అనే వ్యక్తికి థ్యాంక్స్ చెప్పారు.

24 ఏళ్ల క్రితం కేటీఆర్ నుంచి తీసుకున్న ఈ బైక్ ను తాను ఇప్పటికీ వాడుతున్నానని జాన్సన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా గతంలో కేటీఆర్ తో కలిసి ఈ బైక్ నడిపిన రీతిలో ఇప్పుడు కూడా కేటీఆర్ తో కలిసి బైక్ పై తిరగాలని ఉంద‌ని జాన్సన్ తెలిపాడు. ఈ పోస్ట్ చూసిన వెంట‌నే కేటీఆర్ స్పందించారు. 1990లలో సుజుకీ బైక్ లలో ప్రత్యేకించి సుజుకి సమురాయ్ బైక్ పై కుర్రకారు తెగ ముచ్చట పడేవారు. ఆ క్రమంలో కేటీఆర్ కూడా ఆ బైక్ నే వాడారు. నాడు కేటీఆర్ నుంచి తీసుకున్న ఆ బైక్ ను జాన్సన్ ఇప్పటికీ వాడుతుండటం నిజంగా ఆశ్చర్యకరమే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement