Friday, May 17, 2024

ఈ వారం థియేట‌ర్ – ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న చిత్రాలు ఇవే

ఈ వారం విడుద‌ల కాబోతోన్న చిత్రాలు ఏంటో తెలుసుకుందాం..మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న భారీ చిత్ర ఆచార్య‌. ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కి జోడీగా పూజాహెగ్డే న‌టిస్తోంది..కాగా త‌మిళ చిత్రం కాతు వాకుల రెండు కాద‌ల్..తెలుగులో క‌ణ్మ‌ని రాంబో ఖ‌తిజా పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి, స‌మంత‌, న‌య‌న‌తార న‌టిస్తున్ఆన‌రు. ఈ మూవీ ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటించిన చిత్రం రన్ వే 34.. ఈ నెల 29న విడుదల కాబోతోంది. విమానయాన రంగం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. 2015లో జరిగిన ఒక యథార్థ ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ పైలట్ గా నటించారు. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్ శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘భళా తందనాన’ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన క్యాథరిన్ ట్రెసా హీరోయిన్ గా నటిస్తోంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటించారు. వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, సత్య, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన “హీరోపంతి”కి సీక్వెల్ గా “హీరోపంతి-2” రూపొందుతోంది. ఈ సీక్వెల్ లో టైగర్ ష్రాఫ్, తారా సుతారియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించారు. “హీరోపంతి 2” అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ కాగా, ఈ మూవీకి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఏప్రిల్ 29న థియేటర్లలోకి రానుంది.

ఇక ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు-

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రను పోషించిన చిత్రం గంగూబాయ్ కథియావాడి.. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు వర్షన్ కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాప్సీ నటించిన మిష‌న్ ఇంపాజిబుల్ .. ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలో రాబోతోంది. ఏప్రిల్ 29న నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement