Monday, April 29, 2024

Flash: ఏపీలో టీచర్లకు సెలవులు రద్దు..

ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. మే 20 వరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే అనుమతిస్తున్నట్లు అందులో పేర్కొంది. రాష్ట్రంలోని పాఠశాలలకు మే 6 నుంచి జులై 3 వరకు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జులై 4 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో మే 20 తర్వాతే ఉపాధ్యాయులకు సెలవులు అందుబాటులోకి రానున్నాయి.

మరోవైపు సీపీఎస్ ను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు నేడు ఛలో సీఎంవో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో విజయవాడలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో 144 సెక్షన్‌ను విధించి 30 యాక్ట్‌ను అమలు చేస్తున్నారు. సీఎంవో కార్యాలయం వద్ద బారికెడ్లు ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని హోటల్స్‌, లాడ్జీలు, రైల్వే స్టేషన్‌, బస్టాండ్ల వద్ద నిఘా ఉంచారు. విజయవాడ వైపు వచ్చే అన్ని దారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ద్విచక్రవాహనాలతో సహా అన్ని రకాల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement