Monday, April 29, 2024

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న స‌చిన్ టెండూల్క‌ర్ కుమారై !

క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ కుమారై సారా టెండూల్క‌ర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌నే టాక్ వినిపిస్తోంది. సారాకి ఇంస్టాగ్రామ్ లో 1.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.అందుకే ఆమె పిక్స్ పెట్టిన వెంటనే అవి లక్షల్లో లైకులు, షేర్లతో వైరల్ గా మారుతూ ఉంటాయి.అంతేకాకుండా చాలా మంది ఈ భామని అప్పుడప్పుడు కాకుండా తరచుగా పిక్స్ అప్లోడ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా వచ్చిన ఈ వార్తతో వారంతా ఖుషి గా ఉన్నారట‌. 24 ఏళ్ల సారా ఇటీవలె లండన్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్ లో పట్టా పొందింది.అంతే కాకుండా ఇప్పటికే మోడల్ గా రాణిస్తూ పలు యాడ్స్ లో కూడా నటించింది అందులో ఆమె నటనకి ఎంతోమంది షాక్ అవుతుంటారు.దీంతో ఈ స్టార్ కిడ్ బాలీవుడ్ ఎంట్రీ పై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.నిజానికి గతంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఓ సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయం కానుందని ప్రచారం జరిగింది.దీంతో సచిన్ రంగంలోకి దిగి తన కూతురు సారా సినిమాల్లో నటించట్లేదని క్లారిటీ ఇచ్చారు.అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు.అంతే కాకుండా సారా చదువుపై కాన్సన్ట్రేషన్ చేస్తోందని, తర్వాత ఏం చేస్తుంది అనేది ఆమె ఇష్టం అని అన్నారు.మ‌రి ఇప్పుడ‌యినా ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement