Friday, May 3, 2024

Breaking: ఉన్నట్టుండి వెదర్​ కూల్​.. హైద‌రాబాద్‌లో ప‌లు చోట్ల చిరుజ‌ల్లులు

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ సిటీలో వాతావ‌ర‌ణం ఉన్నట్టుండి ఒక్కసారే చ‌ల్ల‌బ‌డింది. శ‌నివారం మ‌ధ్యాహ్నం న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో చిరు జ‌ల్లులు కురిశాయి. దీంతో ఉక్క‌పోత నుంచి న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగింది. జూబ్లీహిల్స్​, షేక్​పేట్​, సికింద్రాబాద్, మారేడుప‌ల్లి, చిల‌క‌ల‌గూడ‌, బోయిన్‌ప‌ల్లి, తిరుమ‌ల‌గిరి, అల్వాల్, బేగంపేట్ ప‌రిస‌ర ప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షం కురిసింది. రాబోయే 2 గంటల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement